Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్లాస్గో : ఇక్కడ జరుగుతున్న వాతావరణ సదస్సు ఆరవరోజున ఫ్ర్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఆధ్వర్యంలో వేలాదిమంది యువతతో బ్రహ్మాండమైన ప్రదర్శన జరిగింది. ఇందులో వాతావరణ కార్యకర్తలు గ్రెటా థన్‌బెర్గ్, వనెస్సా నకాటెలు పాల్గొన్నారు. నానాటికి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేయని పక్షంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యేది యువతేనని ప్రదర్శన నిర్వాహకులు వ్యాఖ్యానించారు. అయితే విధ్వంసాన్ని సృష్టించడం లేదా ప్రభుత్వాన్ని కూలదోయడం తమ ఉద్దేశ్యం కాదని వారు స్పష్టం చేశారు. కేవలం కాలుష్యాన్ని అదుపు చేయడం ద్వారా భూగోళాన్ని కాపాడుకోవాలన్న తమ సందేశాన్ని ప్రపంచ నేతల వరకు తీసుకువెళ్ళడమేనని చెప్పారు. ప్రదర్శనకు హాజరైన యువత సంఖ్యను చూస్తుంటే వాతావరణ మార్పుల పట్ల వారి అభిప్రాయాలు స్పష్టమవుతున్నాయన్నారు. ప్రపంచ నేతలు ఈ విషయాన్ని గుర్తించి, తదనుగుణంగా వ్యవహరించగలరని ఆశిస్తున్నామన్నారు. శుక్రవారం జరిగిన ఈ ప్రదర్శన పూర్తిగా సానుకూల దృక్పథంతో జరిగినదని నిర్వాహకులు స్కై, అన్నా పేర్కొన్నారు. శక్తివంతమైన వ్యక్తులు వెళ్లగలిగే, సమావేశాలు జరిగే వేదికల వద్ద అధికారం, శక్తి సామర్ధ్యాలు వుండవని వారు వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా గల కార్మికులు, విద్యార్ధులు, యువత సంఘీభావంలో అసలైన శక్తి వుంటుందన్నారు.