Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సియర్రా లియోన్లో విషాదం
- 84 మంది సజీవ దహనం
- వందలాదిమందికి గాయాలు
ఫ్రీ టౌన్ : సియర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్లో లారీతో ఇంధన ట్యాంకర్ ఢీ కొనడంతో పెద్ద విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 84మంది మరణించారు. ఢ కొన్న వెంటనే ట్యాంకర్ నుండి ముందుగా పెద్ద మొత్తంలో చమురు చిమ్మింది.ఆ వెంటనే చెలరేగిన మంటలతో ఆ ప్రాంతంలో వున్నవారిని,వాహనాలను ఒక్కసారిగా మంటలు కమ్ముకున్నా యి. ట్యాంకర్ చుట్టూ వీధుల్లో కాలి మాడిపోయిన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి వుండడాన్ని స్థానిక మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. కాగా ఈ విషాద ఘటన పట్ల అధ్యక్షుడు జూలియస్ మాదా బియో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం తీవ్రంగా జరగడం పట్ల విచారం వెలిబుచ్చారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయాన్ని అందచేస్తామని ట్వీట్ చేశారు. మనస్సు కలిచివేసే దృశ్యాలు కనిపిస్తున్నాయని ఫ్రీ టౌన్ మేయర్ వోనె అకి సాయర్ వ్యాఖ్యానించారు. వందమందికి పైగా మరణించినట్టు వదంతులు వస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలోని శవాగారానికి 90కి పైగా మృతదేహాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఫ్రీటౌన్ చుట్టుపక్కల ఆస్పత్రుల్లో వంద మంది వరకు చికిత్స చేయించుకున్నారు. శుక్రవారం రాత్రి 10గంటలస మయంలో వెల్లింగ్టన్ ప్రాంతంలోని చోయిట్రం సూపర్ మార్కెట్ వెలుపల గల జంక్షన్లో ఈ పేలుడు సంభవించింది. చాలామంది వాహనాల్లో ఇరుక్కుని పోయి చనిపోయారు.