Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంపై మరింత పట్టు : ప్రధాని మోడీపై టైమ్-100 కథనం
- మోడీ పాలనలో పెట్టుబడిదారులకు పెద్ద పీట
వాషింగ్టన్ : భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక..ఈ 74 ఏండ్లలో ముగ్గురు కీలకమైన నాయకులు దేశాన్ని పాలించారు. ప్రజాస్వామ్య, లౌకిక దేశంగా భారత్‌ను దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిలబెట్టారు. ఇక ఇందిరాగాంధీ హయాంలో దేశమంతా అల్లకల్లోలాతో అట్టుడుకింది. పొరుగుదేశాలతో యుద్ధాలు, దేశంలో అశాంతి, అత్యవసర పరిస్థితి విధించటం, ఇవన్నీ ఇందిర పాలనలో తీవ్రమయ్యాయి. ఇక మూడో కీలకమైన నేత నరేంద్రమోడీ. కోవిడ్ సంక్షోభం మొదలయ్యేంత వరకు ప్రధాని మోడీ హవా దేశంలో కొనసాగింది. కోవిడ్ మరణాల సంఖ్యను ప్రభుత్వ లెక్కలలో తక్కువ చేసి చూపిందని, వాస్తవంగా కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయనేది బయటకు పొక్కాక..మోడీ ఛరిష్మా తగ్గుతూ వస్తోంది. ఆయన రేటింగ్ 70శాతానికి పడిపోయింది. మోడీ హయాంలో సామ్యవాద పంథా నుంచి భారత్ తప్పుకొని పెట్టుబడిదారీ విధానాల్ని ఎంచుకుంటుందని ఆయన అధికారం చేపట్టిన రోజే అనేకమంది ఊహించారు. ఇందులో చాలావరకు ఆయన సక్సెస్ అయ్యారు. అదేసమయంలో భారత్‌ను లౌకికవాదానికి దూరం చేసి, దేశాన్ని హిందూ అతివాదం వైపునకు నడిపిస్తున్నారు. మైనార్టీ ముస్లిం హక్కుల్ని కాలరాయటమేగాక, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న జర్నలిస్టులను అణచివేస్తున్నారు. ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలను లక్ష్యంగా చేసుకొని మోడీ సర్కార్ చట్టాల్ని సైతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2020 ఏడాదిలో విధించిన మొత్తం ఇంటర్నెట్ షట్డౌన్లలో 70శాతం భారత్‌లోనే అమలైంది. లౌకిక దేశంగా భారత్ పరిస్థితి మొత్తం తిరగబడిందని రెండు అంతర్జాతీయ మేథో సంస్థలు తేల్చిచెప్పాయి. ఎన్నికలతో కూడిన రాచరికం వైపు భారత్ వెళ్తోందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. తాను కోరుకున్న పాలన, వారసత్వం ఇదేనా ? అనేది ప్రధాని మోడీ ఆలోచించుకోవాలి.