Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరున్నర గంటలపాటు వాంగ్ యిపింగ్ వాక్
- నయా చరిత్ర సృష్టించిన చైనా వ్యోమగామి
బీజింగ్: భూమ్మీద నడిచి రికార్డు సృష్టించినట్టు వినేవుంటాం. కానీ అంతరిక్షంలో ఆరున్నరగంటలపాటు నడిచిన మహిళ ఎవరైనా ఉన్నారా..అంటే అవుననే చెప్పవచ్చు. అలా నడిచిన తొలి మహిళగా వాంగ్ యిపింగ్ చరిత్ర సృష్టించారు.చైనా అధికారిక వార్తా సంస్థ 'జిన్హువా' ప్రకారం.. ఇద్దరూ స్పేస్ స్టేషన్ కోర్ మాడ్యూల్ 'టియాన్' నుంచి బయటకు వచ్చి సోమవారం తెల్లవారుజామున ఆరున్నర గంటల పాటు అంతరిక్షంలో నడిచి, ఆపై విజయవంతంగా స్టేషన్కు తిరిగి వచ్చారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చైనా మహిళగా వ్యోమగామి వాంగ్ యిపింగ్ సోమవారం నయా రికార్డు సష్టించారు. ఆమె తన సహౌద్యోగి జారు జిగాంగ్తో కలిసి నిర్మాణంలో ఉన్న అంతరిక్ష కేంద్రం నుంచి ఈ విన్యాసంలో పాల్గొన్నది.ఓ మహిళా వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లడం చైనా అంతరిక్ష చరిత్రలో ఇదే తొలిసారి అని చైనా మెండ్ స్పేస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.ఆరు నెలల పాటు షెంజో-13లో ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి చైనా పంపింది. కక్ష్య నిర్మాణాన్ని (స్పేస్ స్టేషన్) పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ దేశం నుంచి పంపిందనీ, వచ్చే ఏడాది నాటికి స్టేషన్ నిర్మాణ పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు.