Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమికి చేరిన వ్యోమగాములు
కేప్ కేన్వరాల్ : రోదసీలో విజయవంతంగా 200 రోజులు గడిపిన నలుగురు వ్యోమగాములు సోమవారం భూమికి తిరిగివచ్చారు. ఫ్లోరిడిలోని పెన్సాకోలా తీరంలో మెక్సికో గల్ఫ్‌లో అర్ధరాత్రి సమయంలో వారి స్పేస్ కేప్స్యూల్ ల్యాండ్ అయింది. స్పేస్ ఎక్స్ తరపున వారికి స్వాగతమంటూ స్పేస్ ఎక్స్ మిషన్ కంట్రోల్ రేడియో సందేశాన్ని పంపింది. అంతర్జాతీయ రోదసీ స్టేషన్ నుంచి భూమికి రావడానికి వారికి 8గంటలు పట్టింది. బుధవారం రాత్రి మరో నలుగురిని తిరిగి పంపనున్నారు. తొలుత కొత్తవారినే పంపాలని భావించారు, కానీ వాతావరణం బాగుండకపోవడం, పైగా ఒక వ్యోమగామి అనారోగ్యం కారణంగా నాసా మార్పులు చేసింది. ప్రస్తుతం రోదసీ స్టేషన్లో ఒక అమెరికన్, ఇద్దరు రష్యన్లు మాత్రమే వున్నారు. నాసా వ్యోమగాములు షేన్ కిమ్ బ్రో, మేగన్ మెక్ఆర్థర్, జపాన్‌కి చెందిన అకిహికో హోషిడే, ఫ్రాన్స్‌కి చెందిన థామస్ పెస్క్వెట్లు సోమవారం ఉదయానికి భూమికి చేరుకోవాల్సి వుంది కానీ తీవ్ర స్థాయిలో గాలులు వీచడంతో వారి రాక ఆలస్యమైంది.