Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసాంజె భాగస్వామి కేసు నమోదు
లండన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె, ఆయన ఫియా న్సీ స్టెల్లా మారిస్‌లు ఆదివారం బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్, బెల్మార్ష్ జైలు డైరెక్టర్ జెన్నీ లూయిస్లపై దావా వేశారు. జైల్లో తమ వివాహాన్ని జరుపుకునేందుకు ఎన్నిసార్లు అభ్యర్ధనలు చేసినా వీరిద్దరు అనుమతిని నిరాకరిస్తున్నారంటూ అసాంజె, స్టెల్లాలు పేర్కొన్నారు. పెండ్లి చేసుకోవడానికే కాకుండా, చట్ట బద్ధమైన ఆ క్రమాన్ని ప్రారంభించేందుకు కూడా అనుమతించకుండా ఈ ఇద్దరు అధికారులు అడ్డుపెడుతున్నారని స్టెల్లా పేర్కొన్నారు. వారి వైఖరి సరైనది కాదని, తమ కుటుంబ ప్రాథమిక హక్కులను నిరాకరిస్తున్నారని అన్నారు. లాయరైన ఆమె ఇందుకు సంబంధించి బ్రిటీష్ అధికారుల స్పందనను కూడా తమ కేసు పత్రాలకు జోడించారు. కాగా ఈ వివాహ అభ్యర్ధనను క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌కు నివేదించినట్లు జైలు డైరెక్టర్ లూయిస్, అసాంజె లీగల్ టీమ్‌కు తెలియచేశారు. అయితే అసాంజెపై బ్రిటన్ ఎలాంటి అభియోగాలు మోపనపుడు ఇది అసంబద్ధమంటూ న్యాయవాదులు పేర్కొన్నారు. అసాంజెను అమెరికాకు అప్పగించాలా లేదా అనేది ప్రస్తుతం బ్రిటీష్ కోర్టు పరిశీలిస్తోంది.