Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాప్ 26 డ్రాఫ్ట్ టెక్స్ట్
గ్లాస్కో : భూమి ఉష్ణోగ్రతను 1.5 సెంటీగ్రేడ్ల వద్ద పరిమితం చేయానికి ప్రపంచం ఇంకా సుదూరంలో ఉందని ఒక సమాచారం వెల్లడించిన నేపథ్యంలో, 2022 నాటికి ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను మరింత పెంచాలని ప్రపంచ దేశాలకు కాప్ 26 డ్రాఫ్ట్ బుధవారం విజ్ఞప్తి చేసింది. ఇక్కడ జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు కాప్ 26లో 10వ రోజును విడుదల చేసి డ్రాఫ్ టెస్ట్ '2015 పారిస్ ఒప్పందంలో అత్యంత ప్రతిష్టాత్మాకమైన ఉష్ణోగ్రతల లక్ష్యాన్ని అందుకోవడం అత్యంత కీలకం' అని పేర్కొంది. వచ్చే ఏడాది నాటికి ప్రపంచ దేశాలు తమ డీకార్బనైజేషన్ ప్రణాళికలను 'పున సమీక్షించి, బలోపేతం చేసుకోవాలి' అని టెక్స్ట్ పిలుపునిచ్చింది. ఉష్ణోగ్రతలను 1.5 సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయడానికి 'ఈ క్లిష్టమైన దశాబ్ధంలో అన్ని దేశాల చేత అర్ధవంతమైన, సమర్ధవంతమైన చర్యలు అవసరం' అని డ్రాఫ్ట్ టెక్స్ట్ తెలిపింది. ఇప్పటికే తీవ్రమైన వరదలు, కరువులు, తుపాన్లు అనుభవిస్తున్న ప్రపంచ దేశాలు మళ్లీ అధిక ఉష్ణోగ్రతలను అనుభవించకుండా నిరోధించాలంటే 'గ్లోబల్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో వేగవంతమైన, లోతైన, నిరంతర తగ్గింపులు అవసరం' అని తెలిపింది.పారిస్ ఒప్పందం కింద వివిధ దేశాల డీకార్బనైజేషన్ ప్రణాళికల ప్రకారం ఈ శతాబ్దం భూమి 2.7 సెంటీగ్రేడ్లు వేడెక్కే అవకాశం ఉందని ఐరాస అంచనా వేస్తోంది. 2015 పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ దేశాలు ప్రతి ఐదేళ్లకు తమ ఉద్గారాల తగ్గింపు ప్రణాళికలను అప్డేట్ చేసుకోవాలి. అనేక దేశాలు 2020లో ప్రణాళికలను అప్డేట్ చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించాయి. వీటిని నేషనల్లీ డిటెర్మెంట్ కాంట్రీబూషన్స్ (ఎన్‌డిసిలు) అని పిలుస్తారు. ఈ దేశాలు మళ్లీ 2025లో తమ ప్రణాళికలను అప్డేడ్ చేస్తామని చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే 2022 నాటికి ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను మరింత పెంచాలని ప్రపంచ దేశాలకు కాప్ 26 డ్రాఫ్ట్ బుధవారం విజ్ఞప్తి చేసింది. గ్లోబల్ వార్మింగ్‌కు ప్రముఖ, ముఖ్యమైన కారణంగా భావిస్తున్న 'బొగ్గు, శిలాజ ఇంధనాలు'పై సబ్సిడీలను దశలవారీగా తొలిగించడాన్ని మరింత వేగవంతం చేయాలని కాప్ డ్రాఫ్ట్ టెక్స్ట్ తెలిపింది. పారిస్ ఒప్పందంతో సహా గతంలో జరిగిన వాతావరణ శిఖరాగ్ర సమావేశాలు కూడా శిలాజ ఇంధనాలు గురించి ప్రస్తావించలేదు, దీనికి బదులుగా కర్బన ఉద్గారాలపై దృష్టి పెట్టాయి.