Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేం : ఇజ్రాయిల్ ఎన్ఎస్ఓ గ్రూపు ఆర్థిక, న్యాయపరమైన సవాళ్ళను ఎదుర్కొటున్నందున తన పదవికి రాజీనామా చేయాలని గ్రూపు సిఇఓ ఇజిక్ బెన్బెనిస్తి నిర్ణయించారు. సిఇఓగా కేవలం రెండు వారాలు మాత్రమే ఆయన పదవిలో వున్నారు. మొత్తంగా ఈ కంపెనీలో మూడు మాసాలు వున్నారు. అయితే బెన్బెనిస్తి రాజీనామాపై ఎన్ఎస్ఓ గ్రూపు బహిరంగంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. కానీ ఆయన సిఇఓ పదవి నుండి వైదొగాలని భావిస్తున్నారని ఇజ్రాయిల్ మీడియాకు స్పష్టం చేసింది. కంపెనీపై తీవ్రంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అమెరికా వాణిజ్య శాఖ ఎన్ఎస్ఓ గ్రూపును బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక కార్యకర్తల, జర్నలిస్టుల, రాజకీయ నేతల కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎదురైన సవాళ్ళను పరిష్కరించాలని కంపెనీ ప్రయత్నిస్తున్న తరుణంలో నవంబరు ప్రారంభంలో బెన్బెనిస్తి బాధ్యతలు చేపట్టారు.