Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు 'ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్' కింద అనుమతులు ఇచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయంతో వేలాది భారతీయ- అమెరికన్ మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏడాది వేసవిలో వలసదారుల భాగస్వాముల తరపున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్(ఏఐఎల్ఏ) వేసిన పిటిషన్పై అక్కడి హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సానుకూలంగా స్పందించింది. అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏండ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే, హెచ్-4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ పత్రాల పొడగింపు కోసం తరచూ రెగ్యులేటరీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. కానీ, గతంలో హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు పొందకుండా నిషేధం విధించడంతో వారు రీ-ఆథరైజేషన్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.