Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద దేశాల్లో అధిక ధరలకు దారితీస్తోంది : ఐరాస
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆహార ఉత్పత్తుల దిగుమతులు ఈ ఏడాది రికార్డు స్థాయిలో పెరిగాయని ఐక్య రాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల ఆహార దిగుమతుల బిల్లులు ఈఏడాది భారీగా పెరిగిందని, ముందు ముందు మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. కరోనా సంక్షోభ ప్రభావంతో సరుకు రవాణా దెబ్బతినటం, ఎరువుల ధరలు పెరగటం జరిగిందని, దీనివల్ల ఆహార ఉత్పత్తుల ధరలు, సరుకు రవాణా చార్జీలు పెరడానికి దారితీసిందని ఐరాస అభిప్రాయపడింది. ఈ ధరల పెరుగుదల కారణంగా పేద దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని ఐరాస తెలిపింది. తాజాగా విడుదలైన ఐరాస నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ప్రపంచంలో ఆహార దిగుమతుల బిల్లు 14శాతం పెరిగి 1.75 ట్రిలియన్ డాలర్లకు (రూ.130లక్షల కోట్లు) చేరుకుంది. దిగుమతులు మరింత పెరిగే అవకాశముంది. ఆకలి సమస్యను ఎదుర్కోవడానికి పేద దేశాలు మరింతగా ఆహార దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది. కూరగాయలు, ధాన్యం, వంట దినుసులు, మాంసం..మొదలైన వాటిని అధిక ధరల వద్ద, అధిక షిప్పింగ్ రేట్లతో అభివృద్ధి చెందిన దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ పరిణామం పేద దేశాల్లో ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారితీస్తోంది. ఈ ఏడాది అభివృద్ధి చెందిన దేశాల్లో కన్నా ఎక్కువగా పేద దేశాల్లో ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగాయన్న సంగతి ఐరాస గుర్తుచేసింది.