Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 75వ వార్షికోత్సవాలు శుక్రవారం జరిగాయి. 28 దేశాల అధినేతలు పారిస్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చల క్రమాన్ని, పరస్పర అవగాహనను పెంపొందించేందుకు యునెస్కో చేసిన కృషిని ప్రశంసిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వీడియో సందేశాన్ని పంపించారు. తీవ్ర స్థాయిలో అసమానతలు, పర్యావరణ సంక్షోభం, కరోనా మహమ్మారి వంటి సమస్యలు నెలకొన్న సమయంలో విశ్వాసం, సంఘీభావాన్ని పునరుద్ధరించడానికి యునెస్కో పాత్ర గతంలో కన్నా మరింత కీలకంగా మారిందని గుటెరస్ వ్యాఖ్యానించారు.కొత్తగా తిరిగి ఎన్నికైన యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజులే మాట్లాడుతూ, మానవాళి మేథోపరమైన, నైతిక సంఘీభావ పునాదులపై శాంతిని స్థాపించేందుకు పటిష్టమైన నిబద్ధత, అంకిత భావంతో యునెస్కో ఏర్పడిందని అన్నారు.