Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
బీజింగ్ : చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ ఈ నెల 16వ తేదీ ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వీడియో సమావేశం జరుపుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియాంగ్ శనివారం తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి జిన్‌పింగ్ రెండుసార్లు బైడెన్‌తో ఫోన్లో చర్చలు జరిపారు. వివిధ మార్గాల ద్వారా క్రమం తప్పకుండా మాట్లాడుకోవడానికి ఇరువురు నేతలు అంగీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన ప్రధాన అంశాలు, భవిష్యత్ సంబంధాలను నిర్దేశించే అంశాలు చర్చకు రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. . వాతావరణ మార్పులపై సహకారం, కొత్త ప్రచ్ఛన్న యుద్ధం పట్ల వ్యతిరేకత, టారిఫ్‌ల నిర్వహణ వంటి అంశాలపై చర్చలు జరగవచ్చని చైనా విదేశాంగ వ్యవహారాలపై అంతర్జాతీయ సంబంధాల సంస్థకు చెందిన ప్రొఫెసర్ లీ హైడాంగ్ గ్లోబల్ టైమ్స్‌కు తెలిపారు. దేశీయ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, బైడెన్ కూడా చైనా దేశీయ వ్యవహారాలకు సంబంధించిన అంశాల ను ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. తైవాన్‌పై ఇటీవల అమెరికా కవ్వింపు ధోరణి దృష్ట్యా ఒక చైనా సూత్రాన్ని జిన్‌పింగ్ పునరుద్ఘాటించవచ్చని లీ పేర్కొన్నారు. చైనాతో పోటీ విధానాన్ని అమెరికా అనుసరిస్తున్నందున అసలు పోటీ అంటే ఏమిటో అమెరికా వివరించాల్సిన అవసరం వుందని చైనీస్ సామాజిక శాస్త్రాల సంస్థలో రీసెర్చ్ ఫెలో లూ గ్జియాంగ్ వ్యాఖ్యానించారు.