Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాను హెచ్చరించిన రష్యా
మాస్కో : నల్ల సముద్రంలో అమెరికా కవ్వింపు చర్యలు మానకోవాలని రష్యా హెచ్చరించింది. అమెరికా తన యుద్ధ నౌకలను నల్ల సముద్రంలో మోహరిస్తున్నది.. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో రష్యా డిప్యూటీ రాయబారి పోలిన్స్కీ మాట్లాడుతూ, ఉక్రెయిన్పై దాడి చేయాలనుకుంటున్నామన్న వార్తలను ఖండించారు. నిజానికి ఉక్రెయిన్ నుంచే ఎక్కువ ముప్పు ఉందన్నారు. నల్ల సముద్రం చుట్టూ అమెరికన్ యుద్ధనౌకలు సమీపిస్తున్నాయన్న విషయం మరిచిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో నల్ల సముద్రంలో ప్రత్యక్ష ఘర్షణలు నివారించడం ప్రతిరోజూ కష్టమై పోతోందని ఆయన వ్యాఖ్యానించారు. సైనిక చర్యల్లో భాగంగా నల్ల సముద్రంలో గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుఎస్ఎస్ పోర్టర్తో పాటు కమాండ్ షిప్ మౌంట్ విట్నేను కూడా అమెరికా మోహరించింది. నాటో విన్యాసాల్లో భాగంగా బాల్టిక్ సముద్రం నుండి నల్ల సముద్రం వరకు దాదాపు 28వేల మంది సైనికులను అమెరికా మోహరించింది.