Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కప్పిపెట్టిన అమెరికా సైన్యం
న్యూయార్క్ : సిరియాలో తాము చేసిన అకృత్యాలను అమెరికా సైన్యం గోప్యంగా ఉంచింది. 2019 మార్చిలో అమెరికా చేసిన వైమానిక దాడులతో 80 మంది సిరియా పౌరులు మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ తాజాగా వెల్లడించింది. మృతుల్లో 64 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. అమెరికా చేసిన వైమానిక దాడులను 'యుద్ధ నేరాలు'గా న్యూయార్క్ టైమ్స్ వర్ణించింది. సిరియాలో కార్యక్రమాలు నిర్వహించే ఒక అమెరికన్ స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్ ఆదేశాలు ప్రకారం బాఘజ్ సమీపంలో రెండు వరుస వైమానిక దాడులను జరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. సిరియాలో పౌరులపై వైమానిక దాడులు జరిపిన విషయాన్ని అమెరికా వైమానిక కార్యకలాపాలను పర్యవేక్షించిన సెంట్రల్ కమాండ్ మొదటిసారి అంగీకరించింది. అయితే, ఈ దాడులను సమర్థించుకునేందుకు అది యత్నించిందని న్యూయార్క్‌టైమ్స్ తెలిపింది. ఈ దాడులపై రక్షణ శాఖ ఉన్నతాధికారి విచారణ జరిపినా చివరికి ఏమీ తేల్చచకుండానే నివేదికను ముగించింది. ఈ దాడులపై సమగ్రమైన, స్వతంత్ర దర్యాప్తు ఎప్పుడూ జరగలేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. రహస్య పత్రాలు, నివేదికల వివరణలతోపాటు ఈ దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తులతో ఇంటర్వ్యూల ఆధారంగా తన కథనం రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది.