Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షం 'టుగెదర్ ఫర్ ఛేంజ్' తిరిగి విజయాన్ని నమోదు చేసింది. చాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో మొదటి మైనారిటీగా మారడంలో విఫలమైనప్పటికీ సెనెట్‌లో ఐదు కొత్త సీట్లను నిలబెట్టుకోగలిగింది. ఆదివారం జరిగిన అర్జెంటీనా ఎన్నికలు వచ్చే రెండేళ్ళ కాలానికి అల్బర్టో ఫెర్నాండెజ్ ప్రభుత్వానికి రాజకీయ దిశా నిర్దేశం చేయనున్నాయి. ప్రతిపక్షం విజయంతో పాలక పెరొనిస్ట్లకు గట్టి దెబ్బ తగిలింది. సెంటర్ లెఫ్ట్ ప్రభుత్వమైన అల్బర్టో ఫెర్నాండెజ్‌కు గట్టి మద్దతు గల ప్రాంతమైన, కీలకమైన బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్‌లో ప్రతిపక్షం విజయాలు నమోదు చేసింది.