Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్ తీసుకున్న బాలింతల్లోనూ యాంటీబాడీలు క్రియాశీలంగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అయితే, ఈ యాండీబాడీలు వైరస్ నుంచి చిన్నారులకు రక్షణ కల్పిస్తాయా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ అధ్యయనం వివరాలు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో భాగంగా 77మంది బాలింతల నుంచి నమూనాలను సేకరించినట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రొచెస్టర్ మెడికల్ సెంటర్ (యుఆర్ఎంసీ)కు చెందిన బ్రిడ్జెట్ యంగ్ తెలిపారు. వీరిలో 47మంది వ్యాధి బారిన పడిన వారు కాగా, వ్యాక్సిన్లు తీసుకున్న వారు 30 మంది ఉన్నారని అన్నారు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తల్లుల్లో వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు అధిక స్థాయిలో ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.