Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల కార్యాలయం వెల్లడి
న్యూయార్క్ : ఇథియోపియా ప్రభుత్వం వెయ్యి మందిని అత్యవసర పరిస్థితుల కింద నిర్బంధించినట్టు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. వీరిలో చాలామంది తిగ్రయాన్ జాతికి చెందిన వారే. ప్రత్యర్థి టైగ్రే బలగాలతో ఏడాది పాటు సాగిన దారుణమైన యుద్ధం తర్వాత ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రాజధాని అడిస్ అబాబాలో, ఉత్తరాది నగరాలైన గోండర్, బహిర్ దర్, ఇతర ప్రాంతాల్లో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్ కార్యాలయం ప్రతినిధి లిజ్ తెలిపారు. టైగ్రే లిబరేషన్ ఫ్రంట్‌కి చెందిన వారుగా అనుమానిస్తూ ప్రజల్ని నిర్బంధించడంలో ఇథియోపియా అధికారులకు సర్వసాధారణమై పోయిందని ఆమె విలేకర్లతో వ్యాఖ్యానించారు. ఇథియోపియా యుద్ధంలో వేలాదిమంది చనిపోయారు. ఈ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన రీతిలో సంక్షోభాన్ని సృష్టించింది. టైగ్రే ప్రాంతంలో వందలవేల సంఖ్యలో ప్రజలు కరువుకాటకాలను ఎదుర్కొంటున్నారు. అక్కడి పరిస్థితిని 'మానవతా దిగ్బంధనం'గా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది.