Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : అంతరిక్షంలో రికార్డు స్థాయిలో నెల రోజుల పాటు గడిపిన చైనా వ్యోమగాములకు ప్రజలు మంగళవారం అభినందనలు తెలియచేశారు. అక్టోబరు 16న ముగ్గురు వ్యోమగాములు షెంఝూ-13 కోర్ మాడ్యూల్లోకి ప్రవేశించారు. వీరు తియాన్హె రోదసీ స్టేషన్లో ఆరు మాసాలు గడపనున్నారు. చైనా చరిత్రలోనే సుదీర్ఘమైన రోదసీ నివాసంగా షెంఝూ-13 మిషన్ రికార్డు సృష్టించనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఆన్లైన్లో జరిగిన చర్చలో దాదాపు 3కోట్ల మంది చైనా నెటిజన్లు పాల్గొన్నారు. రోదసీలో వున్న వ్యోమగాములను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. ఆ ముగ్గురి ముఖాలు ఉబ్చినట్లు కనిపిస్తున్నాయని వారు వ్యాఖ్యానించారు. రోదసీలో భూమ్యాకర్షణ శూన్యమైనందున, మానవ శరీరంలోని ద్రవాలు పైకే ప్రవహిస్తాయి. దాంతో ముఖం, తలలోకి ద్రవాలు చేరడం వల్ల వారు చూడ్డానికి ఉబ్చినట్లుగా కనిపిస్తుందని రోదసీ నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యోమగాములు రోదసీలో నడిచి ఆరున్నర గంటల పాటు తమకు అప్పగించిన పనులను పూర్తిచేశారు.