Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ప్రయోగాత్మకమైన కోవిడ్ టాబ్లెట్‌ను ఇతర సంస్థలు కూడా తయారు చేయడానికి వీలుగా ఐక్యరాజ్య సమితి తోడ్పాటు కలిగిన గ్రూపుతో ఫైజర్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఈ మాత్ర గనుక వస్తే ప్రపంచంలోని సగానికి పైగా జనాభాకి కోవిడ్ చికిత్స అందుబాటులోకి వస్తుంది. ఈ మాత్ర కోసం జెనీవాకి చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్‌కి లైసెన్స్ మంజూరు చేయనున్నట్టు ఫైజర్ తెలిపింది. దీనివల్ల 95 దేశాల్లో వినియోగించడానికి జనరిక్ డ్రగ్ కంపెనీలు ఈ మాత్రను తయారుచేయవచ్చు. అంటే ప్రపంచంలోని 53శాతం మంది జనాభాకు టాబ్లెట్ అందుబాటులోకి వస్తుందని ఫైజర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కరోనాతో తీవ్ర విధ్వంసాన్ని చవిచూస్తున్న కొన్ని పెద్ద దేశాలను ఈ ఒప్పందం నుండి మినహాయించారు. ఉదాహరణకు ఇతర దేశాలకు ఎగుమతి చేయడం కోసం మాత్రనుతయారు చేయడానికి బ్రెజిల్ ఔషధ కంపెనీకి లైసెన్సు ఇవ్వవచ్చు, కానీ ఆ మందును బ్రెజిల్లో జనరిక్ వినియోగానికి వాడరాదు. 400కోట్ల మందికి పైగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ఈ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యత గల అంశమని మెడిసిన్స్ పేటెంట్ పూల్ పాలసీహెడ్ ఎస్తెబన్ బురోన్ వ్యాఖ్యానించారు. ఇతర ఔషధ సంస్థలు కూడా కొద్ది నెలల్లోనే మాత్రను తయారు చేయగలవని భావిస్తున్నట్టు చెప్పారు.