Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : క్యూబా ప్రజలు వీధుల్లోకి వచ్చి విప్లవానికి మద్దతును పునరుద్ఘాటించారనీ, క్యూబా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి అమెరికా పన్నిన కుట్రను విఫలం చేశారని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రొడ్రిగజ్ పేర్కొన్నారు.
కోవిడ్ మహమ్మారి నియంత్రణలోకి వచ్చిన తర్వాత పాఠశాలలు పున్ణప్రారంభించడాన్ని, హవానా 502వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకునేందుకు మాత్రమే ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వచ్చారనీ, అంతేకానీ నిరసనలు తెలియచేయడానికి కాదని స్పష్టం చేశారు. కానీ అమెరికా మీడియా వీటిని నిరసన ప్రదర్శనలంటూ ప్రచారం చేసిందన్నారు. ఈ దేశానికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని బ్రూనో తెలిపారు. కరేబియా దేశానికి వ్యతిరేకంగా ఇంటర్నెట్లో సాగించిన దుష్ప్రచారం ఎలాంటి ఫలితాన్నివ్వలేదని తన ట్విట్టర్లో ఆయన వివరించారు.
విదేశీ మీడియా ప్రచారం చేసినట్లుగా అణచివేత, ప్రదర్శనలు, సైనికీకరణ ఇలాంటివేవీ కూడా జరగలేదన్నారు. అంతర్గత ఏజెంట్లను ఉపయోగించి, లక్షలాది డాలర్లు ఖర్చు పెట్టి క్యూబా వ్యతిరేక కార్యకలాపాలు రెచ్చగొట్టేందుకు అమెరికా ప్రయత్నించడాన్ని ఆయన ఖండించారు.
క్యూబాకి రష్యా వెజిటబుల్ ఆయిల్ విరాళం
ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పీ) కింద రష్యా 672 టన్నుల వెజిటబుల్ ఆయిల్ని క్యూబాకి విరాళంగా ఇచ్చిందని క్యూబా రాయబారి తెలిపారు. ఇరు దేశాల మధ్య ఏళ్ళ తరబడి వున్న మితృత్వాన్ని ఇది తెలియచేస్తుందని వ్యాఖ్యానించారు. 2018 నుండి ఇప్పటివరకు క్యూబాకు ప్రపంచ ఆహార కార్యక్రమం కింద కోటీ 10లక్షల డాలర్ల విలువైన సాయం అందిందని చెప్పారు.