Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్యసమితి : ఐక్యరాజ్య సమితి మూడు రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఒకటైన యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు 2021-25 పదవీ కాలానికి భారత్ తిరిగి ఎన్నికైంది. ఎగ్జిక్యూటివ్ బోర్టు సభ్యుల ఎన్నిక బుధవారం జరిగింది. ఈ ఎన్నికల్లో భారత్కు 164 ఓట్లు లభించాయని యునెస్కోలో శాశ్వత ప్రతినిధి బృందం ట్వీట్ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి బృందం చేసిన మంచి పనిని గురువారం విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్లో ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో భారత్ అభ్యర్ధిత్వానికి మద్దతిచ్చిన దేశాలకు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కృతజ్ఞతలు తెలియచేశారు. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్కు చోటు దక్కడం ఆనందంగా వుందని వ్యాఖ్యానించారు.