Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ప్రజలను కోరిన వెనిజులా అధ్యక్షుడు
కారకస్ : అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో దేశ ప్రజలను కోరారు. వెనిజులా ఎన్నికల వ్యవస్థను అమెరికా ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. ''ముఖంపై చెంపదెబ్బ కొట్టినట్లు చేయండి, దేశ ఎన్నికల వ్యవస్థను అమెరికా ప్రభుత్వం గౌరవించాలని స్పష్టం చేయండి, వచ్చే ఆదివారం జరిగే ఓటింగ్‌లో ప్రజలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేయాలి'' అని మదురో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అమెరికాలో ఎన్నికలు జరిగిన రెండు మాసాలకు కానీ ఫలితం రాలేదని, పైగా ఎన్నికల ఫలితాన్ని దొంగిలించారంటూ బైడెన్‌పై ట్రంప్ విమర్శలు కూడా చేశారని, కానీ ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో తామెన్నడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు. అమెరికా ఎన్నికల వ్యవస్థను ఏ ఒక్కరూ విశ్వసించరు, అటువంటపుడు వారు వెనిజులా ఎన్నికల వ్యవస్థ గురించి ఎలా మాట్లాడతారు? అని మదురో ప్రశ్నించారు. గత కొన్నేళ్ళుగా తమ దేశంపై ఆంక్షలు, దురాక్రమణలు కొనసాగుతున్నా తమసార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటున్నామని చెప్పారు.