Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా వీధుల్లో వ్యాక్సినేషన్ అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలు, నిరసనలు శనివారం జరిగాయి. వేలాదిమంది ప్రజలు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ వేలాదిమంది వీధుల్లోకి రాగా, మద్దతుగా కూడా చిన్న చిన్న ప్రదర్శనలు జరిగాయి. 16ఏండ్లు ఆ పైన వయస్సు కలిగిన ప్రజల్లో దాదాపు 85శాతం మంది ఈ నెల 19నాటికి పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అన్నది స్వచ్ఛందం చేశారు, కానీ రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో చాలా వృత్తులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి షరతు చేశారు. వ్యాక్సిన్ వేసుకోని వారిని సంగీత కచేరీలకు, హోటళ్ళకు నిషేధించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. మెల్బోర్న్ నడిబొడ్డున గల ప్రాంతంలో వేలాదిమంది వ్యాక్సిన్ వ్యతిరేకులు ప్రదర్శన నిర్వహించారు.. కాగా వ్యాక్సిన్లను సమర్ధిస్తూ మెల్బోర్న్లో వందలాదిమందితో మరో ప్రదర్శన జరిగింది. ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద క్రీడా కార్యక్రమమైన ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ చీఫ్ మాట్లాడుతూ, జనవరిలో జరిగే పోటీల్లో పాల్గొనాలంటే క్రీడాకారులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.