Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 రాష్ట్రాల గవర్నర్లు, మేయర్ల ఎన్నికల్లో పై చేయి ..
- ఇది ప్రజా విజయం. మదురో
కారకస్ : వెనిజులాలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో 23 రాష్ట్రాలకు గానూ 20 రాష్ట్రాల్లో యునైటెడ్ సోషలిస్టు పార్టీ ఆఫ్ వెనిజులా (పీఎస్యూవీ) అభ్యర్థులు ఆధిక్యతలో వున్నారు. మాజీ అధ్యక్షుడు హ్యుగో చావెజ్ అనుసరించిన సిద్ధాంత భావజాలం విజయం సాధించింది. అంతర్జాతీయ ఆంక్షలు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రభుత్వానికి లిట్మస్ పరీక్షగా ఈ ఎన్నికలు జరిగాయి. 23మంది గవర్నర్లను, 335 మంది మేయర్లను, 253మంది ఎంపీలను, 2471మంది కౌన్సిలర్లను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 70వేల మంది అభ్యర్ధులు బరిలో వున్నారు. 37 జాతీయ రాజకీయ పార్టీలకు, 43 ప్రాంతీయ సంస్థలకు వీరు ప్రాతినిధ్యం వహించారు. 55 దేశాలు, సంస్థల నుంచి 300మందికి పైగా రాజకీయ పరిశీలకులు ఈ ఎన్నికలను పర్యవేక్షించారు. 2017 తర్వాత ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. 15 ఏండ్ల తర్వాత యూరోపియన్ యూనియన్ పరిశీలకులు వెనిజులాకు వచ్చారు. 2018లో జరిగిన అధ్యక్ష ఎన్నికలకు, ఆ తర్వాత రెండేండ్లకు జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఈ ఎన్నికలు జరిగాయి. దారుణమైన యుద్ధాన్ని అనుభవించిన ప్రజలు అందించిన ప్రజా విజయం ఇదని మదురో వ్యాఖ్యానించారు.