Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతిస్తే ఆర్థిక నేరాలు పెరగొచ్చు : ఐఎంఎఫ్ హెచ్చరిక
వాషింగ్టన్ : వర్చువల్ కరెన్సీ బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) స్పష్టం చేసింది. ఈ కరెన్సీ ద్వారా రిస్క్ రేటు ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లోను అనుమతించడానికి వీల్లేదని వర్చువల్ కరెన్సీ పుట్టినిల్లు అయినా ఎల్ సాల్వడర్ను ఆదేశించింది. బిట్‌కాయిన్ బాండ్లతో ఏకంగా బిట్ కాయిన్ సిటీ నిర్మాణానికి అనుమతిస్తూ ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె ప్రకటించిన రెండు రోజులకే ఐఎంఎఫ్ ప్రతికూల ప్రకటన చేయడం విశేషం. మధ్య అమెరికా దేశమైన ఎల్ సాల్వడర్ సెప్టెంబర్‌లో యూఎస్ డాలర్‌తో పాటుగా బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ప్రకటించింది. అయితే బిట్‌కాయిన్ చట్టాలకు అనుమతిస్తే ఆర్థిక నేరాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఐఎంఎఫ్ తాజాగా హెచ్చరించింది. దీనికి బదులు కొత్త పేమెంట్ వ్యవస్థలను తీసుకురావడం లేదంటే అభివద్ధి చేయడం లాంటివి చేయాలని ఎల్ సాల్వడర్‌కు సూచించింది. ఐఎంఎఫ్ ప్రకటనతో బిట్‌కాయిన్‌కు చట్టబద్దత కల్పించే యత్నాల్లో ఉన్న దేశాలు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.