Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటిష్ ఎంపీకి అధికారుల మందలింపు
లండన్ : నిద్రపోతున్న తన బిడ్డను సమావేశా నికి తీసుకువచ్చినం దుకు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యురాలు ఒకరు అధికారుల నుంచి మందలింపు లను ఎదుర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులకు కూడా ప్రసూతి శలవు వుండాలని ప్రతిపక్ష ఎంరీ స్టెల్లా క్రీజీ ప్రచారం చేస్తున్నారు. ఆమె తన మూడు నెలల కుమారుడిని ఎత్తుకునే మంగళ వారం జరిగిన ఒక చర్చకు హాజరై మాట్లాడారు. దీంతో ఆమెకు అధికారుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. బిడ్డను ఎత్తుకువస్తే చాంబర్లో మీరు కూర్చోరాదన్న రూలింగ్‌ను ఉటంకిస్తూ ప్రతినిధుల సభ అధికారి నుంచి ఆమెకు ఈ మెయిల్ వచ్చింది. దాన్ని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ రూలింగ్‌ను క్రీజీ ఇతర ఎంపీలు ప్రశ్నించారు. ఆచరణలో ఇప్పటికే వున్న పద్ధతులకు విరుద్ధంగా ఇది కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. 2019లో ఎన్నికైనపుడు తాను తన బిడ్డకు పాలిచ్చానని లేబర్ ఎంపీ అలెక్స్ డేవిస్-జోన్స్ ట్వీట్ చేశారు. వెస్ట్‌మినిస్టర్ హాల్లో ప్రధాన చాంబర్లో తన బేబీకి పాలివ్వవచ్చని స్పీకర్ లిండ్సే హోలే హామీ కూడా ఇచ్చారని ఆమె తెలిపారు. క్రీజి ఇంతకుముందు తన కుమార్తె విషయంలో చేసినట్టుగానే ఇప్పుడు తన కుమారుడిని కూడా తీసుకు వస్తున్నారు. 'నా బిడ్డ చాలా చిన్న వాడు, కానీ కొంతమంది చేసే గొడవ కన్నా తక్కువ చేస్తా డు.' అని ఆమె మీడి యాతో అన్నారు.