Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోపెన్హెగన్ : దేశ మొదటి మహిళా ప్రధానిగా మాగ్దలీనా ఆండర్సన్‌కు స్వీడన్ పార్లమెంట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఇటీవల సోషల్ డెమోక్రటిక్ పార్టీకి కొత్త నేతగా ఆమె ఎన్నికయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో పార్టీ నేతగా, ప్రధానిగా తన పదవులను విడనాడిన స్టీఫెన్ లోఫ్వెన్ స్థానంలో ఆండర్సన్‌ను తీసుకున్నారు. స్వీడన్ చరిత్రలో ఇదొక కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. లింగ సంబంధాల దృష్ట్యా చూసినట్లైతే యూరప్‌లోనే అత్యంత ప్రగతిశీల దేశాల్లో ఒకటిగా దశాబ్దాల తరబడి స్వీడన్‌కు పేరు వుంది. ఇంతవరకు ఉన్నత పదవిలో మహిళ లేరు. ఆండర్సన్‌కు మద్దతిచ్చిన స్వతంత్ర పార్లమెంట్ సభ్యులు అమినేV్‌ా కాకబవె పార్లమెంట్లో మాట్లాడుతూ, సార్వత్రిక, సమాన ఓటు హక్కును ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుని ఇది వందవ సంవత్సరమని గుర్తు చేశారు. మహిళలను ఓటు వేయడానికే అనుమతిస్తూ, ఉన్నత పదవులకు ఎన్నుకోకపోతే ప్రజాస్వామ్యం సంపూర్ణం కాదని ఆమె వ్యాఖ్యానించారు. 349మంది సభ్యులు గల పార్లమెంట్లో 117మంది ఆండర్సన్‌కు ఓటు వేశారు, 174మంది తిరస్కరించారు. 57మంది ఓటింగ్‌కు గైర్హాజరు కాగా, ఒకరు రాలేదు. మొత్తంగా ప్రతిపక్ష సభ్యులందరూ ఆండర్సన్‌కు వ్యతిరేకంగానే ఓటు వేశారు, అయితే స్వీడిష్ రాజ్యాంగం ప్రకారం, పార్లమెంట్ మెజారీటీ అంటే కనీసం 175మంది ఎంపీలు వ్యతిరేకించకపోతే ప్రధానులను నియమించవచ్చు. కొత్త ప్రభుత్వం శుక్రవారం ప్రమాణస్వీకారం చేస్తుందని భావిస్తున్నారు. సోషల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీతో కలిసి ఆండర్సన్ రెండు పార్టీల మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు.