Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాలో మల్టిపుల్ మ్యూటేషన్ విజృంభణ
- డబ్ల్యూహెచ్ఓ ఎమర్జన్సీ మీటింగ్ పెట్టాలి : శాస్త్రవేత్తలు
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో కొత్త కరోనా వేరియంట్ భయపెడుతున్నది. మల్టిపుల్ మ్యూటేషన్ వేరియంట్.బీ 1.1.529 గా గుర్తించినట్టు ఆ దేశ వైరాజిస్ట్ తులియా డి.ఒలివేరా మీడియాకు తెలిపారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ ) అత్యవసర సమావేశాన్ని పిలవాలని అక్కడి శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో రోజుకు వంద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 1200 కేసులు నమోదయినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కొత్త వైరస్ 12ల బోట్స్వానా, హాంకాంగ్‌లోని దక్షిణాఫ్రికా పౌరులలో ఇలాంటి కొన్ని అంటువ్యాధులు ప్రబలుతున్నట్టు వైద్యబృందాలు గుర్తించాయి. గతేడాది కరోనాకు సంబంధించి... బీటా వేరియంట్ దక్షిణాఫ్రికాలో మొదటిసారి బయటపడిది. తర్వాత అది ప్రపంచమంతటా వ్యాపించింది. మా వద్ద ప్రస్తుతం పరిమిత డేటా ఉన్నదనిదక్షిణాఫ్రికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ తెలిపింది. కొత్త వేరియంట్‌పై శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు.దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉన్న గౌతాంగ్ ప్రావిన్స్‌లో 90 శాతం కొత్త కేసులు బీ.1.1.1.529 ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరో వేరియంట్ సీ1.2 ఈ సంవత్సరం దక్షిణాఫ్రికాలో గుర్తించారు. అయితే అది అంత ప్రభావవంతంగా కాదని వైద్య బృందాలు ధ్రువీకరించాయి.
ఐరోపాలో చిన్నారులకు పైజర్ వ్యాక్సిన్
ఐరోపాలో 5 నుంచి 11 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ లబించనున్నది. వ్యాక్సిన్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) డ్రగ్ రెగ్యులేటరీ గురువారం పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇవ్వటానికి ఆమోదించింది.
అమెరికాలోని చిన్నారులపై కరోనా పంజా
అమెరికాలోని చిన్నారులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. యూఎస్‌లో అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి ఆరు మిలియన్లకు పైగా పిల్లలకు కరోనా సోకినట్టు నిర్ధారించారు. ప్రస్తుతం ప్రతి వారం పెద్ద సంఖ్యలో పిల్లలు వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే, ఇక్కడ 5-11 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 70 శాతం మంది ఆసత్ర్రిలో చేరాల్సి వస్తున్నది. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా మారుతున్నట్టు వైద్యులు తెలిపారు. టీకా వేయటంతో..చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.