Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏడాదికి 200 కోట్ల సూదులు అవసరం
- ప్రపంచవ్యాప్తంగా రెట్టింపవుతున్న టీకా ప్రక్రియ
- కరోనా వ్యాక్సినేషన్‌కు సంక్షోభమే : డబ్ల్యూహెచ్ఓ
జెనీవా : కరోనా వ్యాక్సినేషన్ ప్రపంచానికి సిరంజీ సంక్షోభాన్ని తీసుకురావచ్చు, వచ్చే ఏడాది 200 కోట్ల సూదుల కొరత ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిక చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేష్‌కు సిరంజీలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారని నివేదికలో ప్రస్తావించింది.
మీడియా నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 725 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్టు అధికారవర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. వీటిలో సింగిల్, డబుల్ , బూస్టర్ డోస్‌లు ఉన్నాయి. ఈ మొత్తం వ్యాక్సిన్ సాధారణంగా ఒక సంవత్సరంలో ఇచ్చిన మొత్తం టీకాల కంటే రెండు రెట్లు ఎక్కువ. ప్రతి డోస్‌కు ప్రత్యేక సిరంజి ఉపయోగించబడుతున్నది. దీంతో సిరంజి వినియోగం ప్రతి ఏటా రెట్టింపు అవుతుంది.
నెమ్మదించనున్న వ్యాధుల నుంచి రక్షించే లక్ష్యం
డబ్ల్యూహెచ్ఓ మెడిసిన్ అండ్ హెల్త్ ప్రొడక్ట్‌ల యాక్సెస్ విభాగానికి సీనియర్ సలహాదారు లిసా హీడ్‌మాన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, 'వచ్చే ఏడాది నాటికి టీకా కోసం సిరంజిల కొరత ఉండవచ్చనేది మా ఆందోళన. ఇది టీకా వేగాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో...అనేక వ్యాధుల నుంచి ప్రజలను రక్షించే ప్రయత్నాలపై కూడా ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
ప్రపంచ భయాందోళనలకు కారణం కావచ్చు
డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం...సిరంజీల ఉత్పత్తిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నదని సిఫారసు చేసింది, ఎందుకంటే దాని కొరత విపత్కర పరిస్థితులకు దారి తీస్తుంది. అదే సమయంలో... సిరంజీల సరఫరా తగ్గినందున, ప్రపంచ స్థాయిలో భయాందోళనలు కూడా ఉండవచ్చు. వ్యాక్సిన్లు , సిరంజీల సరఫరా కూడా ఉత్పత్తి , వినియోగ స్థలం యొక్క దూరంపై ఆధారపడి ఉంటుంది.
సమర్థవంతమైన ప్రణాళిక అవసరం
లిసా హీడ్‌మాన్ మాట్లాడుతూ, 'అవసరమైన కొరత ఉన్న సంకేతాలు నిజంగా కలవరపెడుతున్నాయి. సిరంజీల విషయానికొస్తే, ఈ కొరత 100 నుంచి 200 కోట్ల వరకు ఉంటుంది. సకాలంలో ఎదుర్కోవడానికి సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించాలి.