Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో అస్పష్టంగా ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ తెలిపారు. ఈమేరకు వివిధ అంశాలపై యూఎస్ శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని సహచరులతో చురుగ్గా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కొత్త రకానికి సంబంధించిన వాస్తవాలు, ఇది యాంటీబాడీలను ఏమారుస్తుందా? తదితర అంశాలపై వారితో సంప్రదిస్తున్నట్టు పేర్కొన్నారు. ''దక్షిణాఫ్రికాలో ఇది కచ్చితంగా కొత్త వేరియంట్. కొన్ని ఉత్పరివర్తనాలు ఉండటంతో.. ప్రత్యేకించి దీని వ్యాప్తి, రోగనిరోధక శక్తిని ఏమార్చడం వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని ఆనుపానులకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది'' అని ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు.