Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియావ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. సెంట్రల్ సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, పెర్త్తో సహా ఆస్ట్రేలియాలోని ఇతర 30 పట్టణాలు, నగరాల్లో శుక్రవారం ఈ నిరసనలు జరిగాయి. వ్యాక్సిన్ ఆదేశాలు వివక్షాపూరితమైనవనే నినాదాలు చేస్తూ సెంట్రల్ వీధులను ప్రజలు దిగ్భంధించారు. పార్లమెంటరీ భవనాల వెలుపల నిరసనలు చేశారు. మంత్రులు రాజీనామా చేయాలని, 'దౌర్జన్యపూరితం'గా ఉన్న ఈ ఆదేశాలను తొలగించాలని ప్రజలు నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో వేలాది మంది పాల్గొనడంతో ఆస్ట్రేలియాలోని నగరాలు జనసముద్రాలుగా మారాయి. సిడ్నీలోని హైడ్ పార్క్ వద్ద నిరసన చేసిన ప్రజలు 'నెవ్వర్ లాక్డౌన్ ఎగైన్', 'లెస్ గవర్నమెంట్, మోర్ ఫ్రీడం' వంటి బ్యానర్లు ప్రదర్శించారు.