Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓమిక్రాన్ వేరియంట్‌తో ఇజ్రాయిల్ అలర్ట్
జెరుసలం : కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా ఇజ్రాయెల్ విదేశీ ప్రయాణికుల ప్రవేశాలను నిషేధించింది. శుక్రవారం దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ సోకిన మొదటి రోగి గుర్తించారు. ఆ తర్వాత మాత్రమే ఇజ్రాయెల్ అనేక దక్షిణాఫ్రికా దేశాల నుంచి ప్రయాణికులను నిషేధిం చింది. ఇప్పుడు దేశంలోకి విదేశీయులందరి ప్రవేశాన్ని నిషేధించారు.'ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' రిపోర్టు ప్రకారం.. ప్రభుత్వం ప్రస్తుతం రెండు వారాల (14 రోజుల )పాటు విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించింది. నిషేధం కూడా అమల్లోకి వచ్చింది. విదేశీయుల ప్రవేశాన్ని నిషేధించిన తొలి దేశం ఇదే.
నిర్బంధంలోకి ఇజ్రాయెల్ పౌరులు..
కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు టీకాలు వేసిన ఇజ్రాయెల్ పౌరుడు ఎవరైనా తిరిగి దేశానికి వస్తే, అతను కరోనా పరీక్ష చేయించుకోవాలి.72 గంటల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. క్వారంటైన్ పీరియడ్ ముగిశాక మళ్లీ కరోనా పరీక్ష ఉంటుంది.
అన్ని నివేదికలు ప్రతికూలంగా రావాలి.వ్యాక్సినేషన్ పూర్తి చేయని వ్యక్తి ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండవలసి ఉంటుంది. దీని తర్వాత కరోనా పరీక్ష నెగిటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది.కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తున్ను అంటువ్యాధి అని గుర్తించింది. డెల్టా వేరియంట్ కంటే త్వరితగతిన వ్యాపిస్తుంది. ఓమిక్రాన్‌పై వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉందా లేదా అనే దానిపై సమాచారం సేకరిస్తున్నారు. ఇవి ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు. 24 గంటలూ సిద్ధంగా ఉండాలని ఆ దేశ ప్రధాని అధికారులను అప్రమత్తం చేశారు.
ఇప్పటికే అమెరికా సహా పలు దేశాల్లో నిషేధం
కొత్త వేరియంట్‌కు భయపడి, బ్రిటన్, సౌదీ అరేబియా, ఇరాన్, యూఎస్, శ్రీలంక సహ అనేక ఆఫ్రికన్ దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించాయి. ఒమిక్రాన్‌తో వ్యవహరించడానికి, ఆఫ్రికాలోని ఏడేనిమిది దేశాల నుంచి విమానాలు, ప్రయాణీకుల రాకపై ఆంక్షలు మొదలుపెట్టాయి.
భారతదేశంలో ఇంకా ప్రయాణ నిషేధం లేదు
భారతదేశం ఇప్పటివరకు ఏ దేశానికీ విమానాలను నిషేధించలేదు, అయితే దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, ఇజ్రాయెల్, హాంకాంగ్,యూకేతో సహా యూరప్‌లోని కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇవ్వబడుతుంది. అదనపు ప్రయోజనాలు, భద్రతా ప్రమాణాలు పాటించాల్సిఉంటుందని అధికారులు తెలిపారు.