Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా వైఖరిని ఖండించిన చైనా, రష్యా
బీజింగ్ : ప్రజాస్వామ్య సదస్సుకు హాజరు కావాలంటూ తైవాన్ను అమెరికా ఆహ్వానించడంపై అమెరికాలోని చైనా, రష్యా రాయబారులు సంయుక్తంగా,తీవ్రంగా ఖండించారు. అమెరికా ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వం నుంచి పుట్టుకు వచ్చినదే ఈ ఆలోచన అని వారు పేర్కొన్నారు.ఈ మనస్తత్వం కారణంగానే కొత్తగా విభేదాలు తలెత్తుతున్నా యన్నారు.ఇది ప్రపంచంలో చీలికకు దారి తీస్తుందన్నారు. ఇటువైపు చైనా తనదైన సొంత పంథాను అనుసరిస్తుండగా, అటువైపు అమెరికా నేతృత్వంలోని రంగుల విప్లవాల నుంచి నెమ్మదిగా పూర్వపు సోవియట్ రిపబ్లిక్లు కోలుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి సైద్ధాంతిక సంబంధ మైన ఘర్షణలు ఎంత బాధాకరమో ప్రజలకు తెలియజేయడానికి చైనా, రష్యా సంయుక్తంగా సందేశాన్ని పంపాయని నిపుణులు వ్యాఖ్యానించారు. 'ప్రజల ప్రజాస్వామ్య హక్కులను గౌరవించండి' అన్న శీర్షికతో ఇరు దేశాల రాయబారులు కిన్ గాంగ్, అనతొలి అనతొవ్ రాసిన వ్యాసాన్ని అమెరికా మేగజైన్ 'నేషనల్ ఇంటరెస్ట్'లో ప్రచురించారు.ఈ రకమైన ధోరణి ఆధునిక ప్రపంచ అభివృద్ధికి అవరోధంగా తయారవుతుందని ఆ వ్యాసం పేర్కొంది. చైనా,రష్యాలు ఇటువంటి చర్యలను నిర్ద్వంద్వంగా తిప్పికొడతా యన్నారు.