Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకాక్ : పదవీచ్యుతురాలైన ఆంగ్ సాన్ సూకీపై జరుగుతున్న కేసు విచారణలో తీర్పును మయన్మార్ కోర్టు వాయిదా వేసింది. అదనపు సాక్షుల నుండి సాక్ష్యాధారాలను నమోదు చేసేందుకు అనుమతిస్తూ ఈ చర్య తీసుకుంది. డిసెంబరు 6వ తేదీకి విచారణను వాయిదా వేశారు. గతంలో సాక్ష్యమిచ్చేందుకు రాలేకపోయిన డాక్టర్ను ఇప్పుడు అనుమతించాల్సిందిగా కోరుతూ డిఫెన్స్ వర్గం పెట్టిన పిటిషన్ను కోర్టు అంగీకరించిందని సంబంధిత అధికారి తెలిపారు. 6న డాక్టర్ సాక్ష్యమివ్వనున్నారు. తీర్పు ఎప్పుడు ఇచ్చేది స్పష్టంగా తెలియరాలేదు. రెండోసారి పదవిని చేపట్టకుండా సూకీని అరెస్టు చేసి, ఆమె పార్టీని నిలువరిస్తూ ఫిబ్రవరి 1వ తేదీన సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకుంది.