Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రేజ్ : ఆస్ట్రియా నగరమైన గ్రేజ్కు తొలిసారి కమ్యూనిస్టు మేయర్‌గా ఎన్నికైన ఎల్క్ ఖర్ సోమవారం పదవీ ప్రమాణం చేశారు. అనంతరం ఖర్ మాట్లాడుతూ, గృహ నిర్మాణం, సామాజిక విధానాలపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు చెప్పారు. గ్రేజ్ సిటీ కౌన్సిల్ గత బుధవారం జరిగిన ఎన్నికల్లో ఖర్ను మేయర్‌గా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. 46ఓట్లకు గానూ ఆమెకు 28ఓట్లు లభించాయి. ఆస్ట్రియాలో రెండవ అతిపెద్ద నగరమైన గ్రేజ్లో ఆస్ట్రియన్ కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు పనిచేసిన మేయర్ నగల్, పీపుల్స్ పార్టీ సభ్యులు. 18ఏళ్ళపాటు ఈ పదవిలో కొనసాగారు. ఆస్ట్రియన్ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలైన ఖర్ అనూహ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందారు. ఆస్ట్రియాలో కమ్యూనిస్టు పార్టీ దశాబ్దాలుగా చాలా కీలకమైన రాజకీయ శక్తిగా వుంది. ఖర్ కూడా దాదాపు 30ఏళ్ల నుండి పార్టీ సభ్యురాలిగా వున్నారు. గ్రేజ్ కౌన్సిలర్‌గా ఆమె గతంలో 16ఏళ్ళు పనిచేశారు. నగరానికి కొత్త గృహ నిర్మాణ ప్రణాళికను అమలు చేయాలన్నది తన అభిమతమని చెప్పారు. సామాజిక, పర్యావరణ పథకాలకు మద్దతు ఇస్తామని, గ్రేజ్లో ప్రతి బిడ్డకు సైకిల్ వుండేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం గ్రీన్స్, సోషల్ డెమొక్రటిక్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీ పొత్తు పెట్టుకుంది.