Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ ..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా మారింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచ వ్యాప్తంగా జీవన వ్యయాలను భారం చేయడంతో... టెల్ అవీవ్‌లో నివసించాలంటే ఇక భారీగా ఖర్చు చేయాల్సిందే. ఈ విషయం బుధవారం వెల్లడించిన ఓ సర్వేలో తేలింది. ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఇఐయు) సంకలనం చేసిన అధీకత ర్యాంకింగ్‌లో ఐదు స్థానాలు ఎగబాకి ఈ నగరం తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా జీవన వ్యయ సూచి 173 నగరాల్లోని వస్తువులు, సేవల ధరలను యుఎస్ డాలర్లతో పోల్చడం ద్వారా సంకలనం చేసింది. డాలర్ మారకంతో దేశ కరెన్సీ షెకెల్ బలపడటంతో..అలాగే రవాణా, నిత్యవసర సరుకులు కూడా పెరగడం ఇందుకు దోహదం చేసింది. టెల్ అవీవ్ తర్వాత పారిస్, సింగపూర్లు సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకోగా.. జురిచ్, హాంగ్‌కాంగ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆరో స్థానంలో న్యూయార్క్, ఏడో స్థానంలో జెనీవా ఉన్నాయి. కోపెన్‌హెగెన్ ఎనిమిది, లాస్ ఏంజెల్స్ తొమ్మిది, జపాన్‌లోని ఒసాకా 10వ స్థానంలో నిలిచాయి.