Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : కరోనాతో దీర్ఘకాలం బాధపడిన చాలామందికి.. కొన్ని నెలల తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కోవిడ్‌తో సుదీర్ఘకాలం బాధపడిన వారిలో... విపరీతమైన అలసటతో కూడిన క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (సీఎఫ్‌సీ), శ్వాస సంబంధ సమస్యలు వెంటాడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా వైరస్ల కారణంగా ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత సీఎఫ్‌సీ సమస్యలు ఎదురవుతాయి. దీంతో తీవ్ర అలసట, కుంగుబాటు వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే కోవిడ్ దీర్ఘకాల బాధితుల్లో పోస్ట్ - అక్యూట్ సీక్వెట్ ఆఫ్ సార్స్ - కొవ్-2 (పీఏఎస్సీ) కనిపిస్తోందని పరిశోధకులు కనుగొన్నారు.
ముఖ్యంగా ఆసుపత్రిలో ఉండి దీర్ఘకాలం చికిత్స పొందిన వారిలోనే కాకుండా.. హౌం ఐసోలేషన్‌లో ఉన్నవారిలోనూ ఈ సమస్య తలెత్తుతోందని.. మౌంట్ సీనారు ఆసుపత్రి పరిశోధకులు గుర్తించారు. ఈ సమస్య వల్ల తీవ్ర అలసట, దేనిపైనా ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, నిద్రలేమి, ఒళ్లు, కండరాల నొప్పులు, శ్వాస సరిగ్గా ఆడపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు.
కోవిడ్ మాదిరిగానే.. గతంలో 2005లో సార్స్ -కొవ్ -1కు గురైన వారిలోనూ దాదాపు ఇలాంటి లక్షణాలే కనిపించాయని పరిశోధనకర్త డా. డొన్నామాన్సిని పేర్కొన్నారు ఈ సమస్యపై ఆయన మాట్లాడుతూ.. 'సార్స్ -కొవ్-1కు గురైన వారిలో 27 శాతం మంది నాలుగేళ్ల వరకూ సీఎఫ్‌సీ సమస్యలతో బాధపడ్డారు. తీవ్రస్థాయి కోవిడ్ బాధితులు కూడా సీఎఫ్‌సీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు నష్టం వాటిల్లుతున్నట్టు గుర్తించాం.' అని ఆయన అన్నారు. ఇప్పటికే దీర్ఘకాల కోవిడ్‌తో బాధపడిన 23-69 సంవత్సరాల వయసున్న మొత్తం 41 మంది ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించి..పల్మనరీ, కార్డియాలజీకి సంబంధించిన సీపీఈటీ వంటి అనేక వైద్య పరీక్షలు కూడా చేపట్టారు.