Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ జనాభాలో 37 శాతం మందికి..ఐటీయూ
జెనీవా : ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ తరగతులు తప్పనిసరయ్యాయి. దీంతో అందరికీ ఇంటర్నెట్ ఒక నిత్యావసర వస్తువుగా మారింది. కానీ.. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో 290 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగానికి దూరంగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) వెల్లడించింది. ఈ 290 కోట్ల మందిలో 96శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉండటం విశేషం.కరోనాకు ముందు.. 2019లో డిజిటల్‌కి మారిన వారి సంఖ్య 410కోట్లు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 490కోట్లకు చేరినట్టు ఐటీయూ అంచనా వేసింది. అయినా 37 శాతం మంది ఇంటర్నెట్ సదుపాయం లేక డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్టు వెల్లడించింది. పేద దేశాల్లో ఇంటర్నెట్కి అయ్యే ఖర్చులను ప్రజలు భరించలేక వినియోగించడం లేదని పేర్కొంది. పేదరికం, నిరాక్షరాస్యత, పరిమిత విద్యుత్ సదుపాయం, డిజిటల్ నైపుణ్యాల కొరత వారికి సవాళ్లుగా మారుతున్నాయని తెలిపింది. వారందరినీ డిజిటల్‌గా అనుసంధించడం కోసం.. వారికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఐటీయూ పేర్కొంది.