Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్జెంటీనా కోర్టు తీర్పు
- 10లక్షల డాలర్ల జరిమానా
- దేశం విడిచి వెళ్లరాదంటూ నిషేధం
బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనా మాజీ అధ్యక్షుడు మారిసియో మాక్రి (2015-2019)ని ఆ దేశ అత్యున్నత న్యాయ స్థానం అభిశంసించింది. 2017లో నావికాదళానికి చెందిన జలాంతర్గామి శాన్ జువాన్ సిబ్బంది బంధువులపై గూఢచర్యానికి పాల్పడిన కేసులో మాక్రిని దోషిగా నిర్ధారించింది. దాదాపు 10లక్షల డాలర్ల వరకు మాజీ అధ్యక్షునికి జరిమానా విధించారు. దేశం విడిచి వెళ్లరాదంటూ కోర్టు నిషేధం విధించింది. ఆయన ప్రస్తుతం చిలీలో వున్నందున ఆర్జెంటైనా వచ్చినట్లైతే తాజా నిర్ణయం అమలవుతుంది. పైగా కోర్టుకు ముందుగా తెలియచేయకుండా పది రోజుల కన్నా ఎక్కువ రోజులు ఇల్లు వదిలి వెళ్లరాదు. ఒకవేళ అడ్రస్ మారితే న్యాయమూర్తి మార్టిన్ బావాకి తెలియచేయాల్సి వుంటుంది. 44మంది బాధితుల బంధువులపై అక్రమంగా గూఢచర్యానికి పాల్పడినట్లు మాజీ అధ్యక్షునిపై ఆరోపణలు వున్నాయి. 2020లో ఫెడరల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎఎఫ్ఐ) ఆడిటర్ క్రిస్టినా పిటిషన్ వేయడంతో కేసు నమోదైంది.