Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూరప్‌ను హెచ్చరించిన రష్యా
స్టాకహేోం : యూరప్‌లో తిరిగి సైనిక ఘర్షణలు నెలకొనే పరిస్థితి రానుందని రష్యా హెచ్చరించింది. అదే గనుక జరిగితే యూరప్‌కు అది ఒక పీడకలగా మిగిలిపోతుందని పేర్కొంది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా చేసే ప్రతిపాదనలన్నింటినీ వినేందుకు నాటో తిరస్కరిస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ గురువారం పేర్కొన్నారు. ఒఎస్‌సిఇ మంత్రిత్వ మండలి సమావేశానికి ఆతిథ్యమిస్తున్న స్టాకహేోంలో ఆయన మాట్లాడుతూ, యూరప్ ఖండంలో వ్యూహాత్మక సుస్థిరతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని రష్యా భావిస్తోందన్నారు.ఉద్రిక్తతలు పెచ్చరిల్లకుండా, ప్రమాకదరమైన ఘటనలను నివారించేందుకు తాము చేసిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు నాటో తిరస్కరిస్తోందన్నారు. మరోవైపు నాటో రష్యా సరిహద్దులను సమీపిస్తోందని చెప్పారు. తిరిగి ఘర్షణాయుత పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా సరిహద్దుల్లో సైన్యం మోహరింపుపై భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో లావ్రోవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.