Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యుహెచ్ఓ సూచన
మనీలా : కరోనా డెల్టా వేరియంటపై పోరులో అనుసరించిన పద్ధతులే ఒమిక్రాన్‌పై పోరులోనూ ఉపయోగించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. సరిహద్దులను మూసివేసే చర్యలూ ఇప్పుడూ చేపట్టాల్సిన అవసరముందని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ పశ్చిమ ఫసిఫిక్ అధికారులు ఈ విషయాన్ని శుక్రవారం నాడిక్కడ వెల్లడించారు. డబ్ల్యుహెచ్ఓ పశ్చిమ ఫసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ తకేషి కాసై మాట్లాడుతూ, 'సరిహద్దులను మూసివేయడం వైరస్ నియంత్రణను ఆలస్యం చేస్తుంది. మనకు సమయాన్ని ఇస్తుందని అన్నారు. 'ఒమిక్రాన్‌ను ఎదుర్కోడానికి మన మార్గాలను మార్చుకోనవసరం లేదు' అని చెప్పారు. డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలనే దీనికి అవలంభించవచ్చన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఒమిక్రాన్‌ను ఆందోళన కలిగించే వేరియంట్‌గా గుర్తించారని, ఇది ఇతర వేరియంట్ల కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఆస్ట్రేలియా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు సంస్థ ప్రాంతీయ అత్యవసర డైరెక్టర్ డాక్టర్ బాబా తుండే ఒలోవోకురే తెలిపారు.ఒమిక్రాన్ వేరియంట్ శ్రీలంకకు వ్యాపించింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసును గుర్తించినట్లు శ్రీలంక అధికారులు శనివారం వెల్లడించారు.