Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌లో భాగంగా చేపట్టిన చైనా-లావోస్ రైల్వే ప్రాజెక్టు శుక్ర వారం నుండి కార్యకలాపాలు ప్రారంభించింది. చారిత్రాత్మక రైల్వే ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, దేశ అధ్యక్షుడు సీ జిన్‌పింగ్, లావో పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు తాంగ్లూయిన్ సిసోలిత్ వీక్షించారు. విద్యుత్‌తో నడిచే ఈ ప్రయాణికుల, సరుకు రవాణా రైలు లావోస్‌లో 422 కిలోమీటర్లతో కలిపి మొత్తంగా 1035 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. వాయవ్య చైనా యునాన్ ప్రావిన్స్‌లోని కన్మింగ్ నగరం నుండి లావోస్ రాజ ధాని వియంటియానెకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రయాణంతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 10గంటలు తగ్గనుంది. పర్వతాలు, లోయల గుండా గంటకు 160కిలో మీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్ళు ప్రయాణిస్తాయి. శుక్ర వారం మధ్యాహ్నం ఒకే సమయంలో కన్మింగ్, వియాంటియానెల నుండి పాసింజర్ రైళ్లుబయలు దేరాయి. ఆసియా వన్యప్రాణి ఏనుగులతో సహా వన్య ప్రాణి జంతువులు ఎక్కువగా వుండే ప్రాంతాల నుండి ఈ రైల్వే లైను వెళుతుంది. పర్యావరణ పరంగా అత్యంత సున్నితంగా వుండే ప్రాంతాలను డెవలపర్లు మినహాయించారు. వంతెనలు నిర్మించి, రక్షిత కంచె లను ఏర్పాటు చేసి పర్యావరణంపై ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రభావాన్ని బాగా తగ్గించారు. లావోస్‌లో నిర్మా ణం 2016 డిసెంబరులో ప్రారంభమైంది. చైనాలో నిర్మాణాన్ని అంతకు ఏడాది ముందుగానే 2015 డిసెంబరులో చేపట్టారు. 900కిలో మీటర్ల ఈ రైల్వే లైను పొడవునా మొత్తంగా 167 సొరంగాలు, 301 వంతెనాలు నిర్మించారు. ఈ క్రమంలో బిల్డర్లు అనేక సాంకేతిక సమస్యలను అధిగమించారు.