Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశీ ప్రయాణికులకు అమెరికా ఆంక్షలు
న్యూయార్క్ : భారత్ సహా విదేశాల నుంచి తమ దేశంలోకి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని అమెరికా ఆంక్షలు విధించింది. పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలు ఈ నెల 6 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా ఆరోగ్య విభాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (హెచ్హెస్ఎస్), సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తెలిపింది. రెండేళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సున్న ప్రయాణీకులందరికీ ఈ రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ప్రయాణానికి ఒక రోజు ముందుగానే కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తీసుకోవాల్సివుంటుందని తెలిపింది.