Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. 'వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ నూతన వేరియంట్ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. దీంతో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై అక్టోబర్లో వెల్లడించిన మా అంచనాల్లో తగ్గుదల కనిపించవచ్చు' అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా తెలిపారు. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా గుర్తించిన ఒమిక్రాన్ ఇప్పటికే 40 దేశాలకు వ్యాప్తి చెందింది. దీంతో అనేక దేశాలు కొత్తగా ప్రయాణ అంక్షలు విధిస్తున్నాయి.