Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ అంగీకారం
బెర్లిన్ : జర్మనీలో త్వరలో వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు కానుంది. పర్యావరణవేత్తల- వ్యాపారవేత్తల పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు జర్మనీలోని సోషల్ డెమెక్రాట్స్ పార్టీ ఆమోదం తెలిపింది. శనివారం జరిగిన పార్టీ సమావేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటకు 598-7 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది. ఈ సమావేశానికి ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ ఆమోదంతో వచ్చేవారంలో జర్మనీ చాన్సలర్‌గా ఓలాఫ్ స్కోల్జ్ పదవిని అలంకరించడానికి అవసరమైన మూడు ఆమోదాల్లో ఈ మొదటి దానికి ఆమోదం లభించినట్లయింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మిగిలిన రెండు పార్టీలు కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
సెప్టెంబరు 26న జరిగిన జర్మనీ ఎన్నికల్లో సోషల్ డెమెక్రాట్లు స్వల్ప మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటకు ఇతర పార్టీలతో చర్చలు ప్రారంభించారు. నవంబర్ 24న ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా చేసుకున్నారు. సోషలిస్టు ప్రభుత్వం ఏర్పాటయితే ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న మెర్కెల్‌కు చెందిన సెంటర్ రైట్ క్రిస్టియన్ డెమెక్రటిక్ యూనియన్ 16 ఏళ్ల తరువాత ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటుంది. చాన్సలర్‌గా ఓలాఫ్ స్కోల్జ్‌ను ఎన్నుకోవడానికి బుధవారం పార్లమెంట్ సమావేశం కానుంది.