Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా ప్రజాస్వామ్యం గురించి చెప్పే కబుర్లకు, ఆ దేశంలో వాస్తవంగా అనుసరిస్తున్న పద్ధతులకు ఏమాత్రం పొంతన ఉండదు. అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ డొల్లతనాన్ని స్పష్టంగా ఎత్తి చూపే ఘటనలు కోకొల్లలు. అందులో మచ్చుకు కొన్ని...
కేపిటల్ హిల్ అల్లర్లు అయిదుగురు మృతి,140 మందికి పైగా గాయాలు
కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడిని ధ్రువీకరించేందుకు 2021 జనవరి6న అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రారంభమవుతుండగా, దానిని అడ్డుకునేందుకు ఏకంగా పార్లమెంటు భవనం (కేపిటల్ హిల్)పైనే వేలాది మంది దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో అయిదుగురు చనిపోయారు. మరో 140 మందికి పైగా గాయపడ్డారు. 1814 తరువాత వాషింగ్టన్ డిసిలో ఇంత దారుణమైన ఘటనలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. అలాగే 200 ఏళ్ల కేపిటల్ హిల్ చరిత్రలో పార్లమెంటుపై ఈ విధంగా దండెత్తడం ఇదే తొలిసారి.
మూడున్నర రెట్లు అధికం
1980-2018 మధ్య అమెరికాలో పోలీస్ హింసలో 30,800 మంది దాకా చనిపోయారు. పోలీస్ హింసలో శ్వేతజాతీయుల కన్నా ఆఫ్రికన్ అమెరికన్లు మూడున్నర రెట్లు అధికంగా మరణించినట్లు యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ అధ్యయనంలో తేలింది.
అమెరికన్ యూదుల్లో పెరుగుతున్న అభద్రత
తమకు భద్రత కొరవడిందనే భావన అమెరికన్ యూదుల్లో అంతకంతకూ పెరుగుతోంది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 2020లో ఇది 43 శాతానికి చేరింది. యూదు వ్యతిరేకత తీవ్ర సమస్యగా ఉందని భావించేవారి సంఖ్య 2013లో 14 శాతం వుండగా, 2017 నాటికి అది 41 శాతానికి పెరిగింది.
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఘోర వైఫల్యం
కోవిడ్ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య: 4.8 కోట్లు
మరణాలు: 7లక్షల 70 వేలకు పైగా (2021 నవంబరు ఆఖరు నాటికి)
కోవిడ్ కేసులు, మరణాలు రెండింటిలోనూ ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో చోటుచేసుకున్నాయి.
పేరుకే భావ ప్రకటనాస్వేచ్ఛ
అమెరికన్ మీడియాలో తొంభై శాతం దాకా కొద్ది మంది గుత్త పెట్టుబడిదారుల గుప్పెట్లో చిక్కుకుంది. వీరు యేటా గడించే లాభాలు కొన్ని వర్థమాన దేశాల జిడిపి కన్నా మించిపోయింది.
అమెరికాలో 46 మార్కెట్లలో 92,000 మంది ఆన్లైన్ వార్తలు చదివేవారిని సర్వే చేయగా, వార్తల విశ్వసనీయత అథమ స్థాయికి పడిపోయిందని 29 శాతం మంది అభిప్రాయపడినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ జరిపిన సర్వేలో వెల్లడైంది.