Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిమా: పెరూ అధ్యక్షులు పెడ్రూ కాస్టిల్లోపై అభిశంసన తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్ తిరస్కరించింది. అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా 76ఓట్లు రాగా,అనుకూలంగా 46ఓట్లు వచ్చాయి. అభిశ ంసన ప్రక్రియ ప్రారంభించడానికి 52 ఓట్లు అవసరం కాగా, 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. సైనిక అధికారుల్లో తన అనుకూల వ్యక్తులకు పదో న్నతులు కల్పించారనే ఆరోపణలతో కేస్టిల్లోపై ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించారు.ఈ తీర్మానానికి అనుకూలంగా మూడు మితవాద పార్టీల సభ్యులు ఓటు వేయగా, వ్యతిరేకంగా మార్క్సిస్టు పార్టీ పెరూ లిబ్రే, వామపక్ష కూటమి జుంటో పోర్ ఎల్ పెరూ (జెపి) ఓటు వేశాయి.