Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : భారత్లో అమెరికా రాయబారి, లాస్ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి నియామకాన్ని మంగళవారం అమెరికా సెనెట్ ధ్రువీకరించనుంది. ఈ పదవికి ఆయనను నామినేట్ చేసిన ఐదు నెలల తర్వాత మంగళవారం సెనెట్ సమావేశమవుతోంది, సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ ముందు గార్సెట్టి హాజరవనున్నారు. రిపబ్లికన్ సెనెటర్లు ఇన్ని నెలలుగా ఈ సమావేశాన్ని వాయిదా వేస్తూ రావడంతో ఈ ధ్రువీకరణ కూడా వాయిదాపడింది. వచ్చే ఏడాది డిసెంబరుతో మేయర్గా గార్సెట్టి పదవీ కాలం పూర్తికానుంది. 2013 నుండి ఆయన ఈ పదవిలో వున్నారు. అమెరికా నావికాదళంలో మాజీ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. తనకు గార్సెట్టి నుండి వేధింపులు ఎదురయ్యాయంటూ మాజీ అంగరక్షకుడు మాథ్యూ గార్జా దావా వేశారు. ఆ ఆరోపణలను ఆయన తిరస్కరిస్తున్నారు. జర్మనీ, పాకిస్తాన్ రాయబారుల పదవులకు నామినీలు కూడా అదేరోజు కమిటీ ముందు హాజరు కానున్నారు.