Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 53 మంది మృతి.. మరో 58 మందికి గాయాలు
- అక్రమ వలసదారులతో వెల్తున్న ట్రక్కు అదుపుతప్పి పాదచారుల బ్రిడ్జిని ఢకొీట్టడంతో ఘటన
చియాపస్ : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. మితిమీరిన వేగంతో వెళ్తున్న ఒక ట్రక్కు ప్రమాదానికి గురై అందులో ప్రయాణిస్తున్న దాదాపు 53 మంది మృతి చెందారు. మరో 58 మందికి గాయాలయ్యాయి. చియాపాస్ రాష్ట్ర రాజధాని టక్స్ట్లా గురియెర్రెజ్ వైపు రహదారి మీదుగా వందకు పైగా మందితో వెళ్తున్న ఒక ట్రక్కు అదుపు తప్పి పాదచారుల వంతెనను ఢ కొట్టింది. దీంతో ట్రక్కు బోల్తాపడి ఈ ఘోర ప్రమాదానికి దారి తీసిందని ఓ అధికారి తెలిపారు. ప్రమాద సమయంలో ట్రక్కు మితి మీరిన వేగంతో వెళ్తున్నదనీ, ఈ సమయంలో అదుపుతప్ప ప్రమాదానికి గురైనట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు ఆ రాష్ట్ర పౌర భద్రత సేవ అధిపతి లూయీస్ మాన్యుయెల్ మొరెనో వెల్లడించారు. బాధితులంతా వలసదారులనీ, వారంతా మధ్య అమెరికాకు చెందినవారిగా తెలుస్తున్నదని తెలిపారు. వారి చిరునామాలు మాత్రం ఇప్పటికీ ధ్రువీకరణ కాలేదని చెప్పారు. బాధితుల్లో కొంతమంది తాము పొరుగుదేశమైన గ్వాంటెమాలాకు చెందినవారుగా చెప్పారని ఆ అధికారి వివరించారు మితిమీరిన వేగంతో పాటు పరిమితికి మించి . ''గ్వాంటెమాలా, హోండురస్‌కు చెందిన వలసదారులతో ట్రక్కు వెళ్తున్నది. ఇందులో పది మంది చిన్నారులూ ఉన్నారు'' అని ఈ ప్రమాద బాధితుల్లో ఒకరైన సెల్సో పచేకో తెలిపారు. తాము యూఎస్‌కు చేరుకోవడానికి ప్రయత్నించామనీ, అయితే, ఇప్పుడు తమను తిరిగి గ్వాంటెమాలకు పంపించేలా కనబడుతున్నదని వెల్లడించారు.
అక్రమ వలసదారులకు కీలకం చియాపాస్
అక్రమ వలసదారులకు చియాపాస్ కీలకంగా ఉన్నది. ఇటీవల కాలంలో మధ్య అమెరికా నుంచి మెక్సికో గుండా యూఎస్‌కు అక్రమ వలసలు పెరిగాయి.అక్టోబర్ నాటికి ఒక్క ఏడాదిలోనే 17 లక్షల మంది వలసదారులు యూఎస్‌లోకి ప్రవేశించినట్టు సమాచారం.''మేం గ్వాంట ెమాలా సరిహద్దు వద్ద ట్రక్కులో ఎక్కాము.ప్యూబ్లా రాష్ట్రానికి చేరుకోవడం కోసం రూ.1,89,100 నుంచి రూ.2,64,700 వరకు చెల్లించాం.అక్కడ నుంచి మరికొందరితో కలిసి యూఎస్ సరిహద్దుకు చేరుకునేవాళ్లం''అని బాధితులు తెలిపారు.కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో ఇంకా చాలా మందే ఉన్నారనీ, అయితే, దొరికితే అధికారులు నిర్బంధిస్తారన్న భయంతో వారంతా పారిపోయినట్టు ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యలు జరపడానికి వచ్చిన కార్మికులు తెలిపారు.గాయాలతో తీవ్ర రక్తస్రావమవుతన్నప్పటికీ వాటిని లెక్క చేయ కుండా మరికొందరు బాధితులు పారిపోయారని ఒక వైద్యుడు తెలిపారు.