Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యంపై బైడెన్ సదస్సు పిలుపు
వాషింగ్టన్ : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకనే పేరుతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య సదస్సు గురువారం ఆన్లైన్లో ప్రారంభమైంది. తమ ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటిస్తూ నిర్దిష్ట హామీలు ఇవ్వాలంటూ సదస్సు పిలుపిచ్చింది. ఈ సదస్సుకు వందకు పైగా దేశాలను ఆహ్వానించారు. పౌర సమాజ సంస్థలను, వివిధ పార్లమెంట్ల సభ్యులను, ప్రైవేట్ రంగ వ్యక్తులను కూడా ఆహ్వానించారు. ''ప్రజాస్వామ్యమనేది ఒక్కసారిగా, అకస్మాత్తుగా సంభవించదు. ప్రతి తరంలోనూ దాన్ని పునరుద్ధరించుకోవాల్సి వుంటుంది.'' అని బైడెన్ వ్యాఖ్యానించారు. ''న్యాయం కోసం, భావ ప్రకటనా స్వేచ్ఛ, స్వేచ్ఛగా గుమిగూడడం, స్వేచ్ఛాయుత పత్రికా రంగం, మత స్వేచ్ఛ, ప్రతి వ్యక్తికి వుండే మానవ హక్కులు వీటన్నింటి కోసం మనం నిలబడాల్సి వుంది.''అని ఆయన పేర్కొన్నారు.